News

చంద్రబాబు ఇబ్బంది పెడుతున్నారు : కేసీఆర్


టీఆర్‌ఎస్‌ బలపడితే తెలంగాణ బలపడినట్లే అని సీఎం కేసీఆర్‌ అన్నారు. బుధవారం పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీఎస్‌కు పదవులు ఒక లేక్క కాదన్న ఆయన బంగారు తెలంగాణ సాధనలో డీఎస్‌ సేవలను వినియోగించుకుంటామని ఆయన అన్నారు. రాష్ట్రం విడిపోయినా తెలంగాణనై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశలు వదులుకోలేదని ఆయన విమర్శించారు. ఓటుకు నోటు కేసులో నానా యాగి చేస్తున్నారని కేసీఆర్‌ అన్నారు.

వాళ్ల పాలన వాళ్లు చేసుకోవచ్చు కదా అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏడాది బిడ్డ అని ప్రభుత్వాన్ని తిట్టడం గొప్ప అనుకుంటే తప్పని ఆయన అన్నారు. ఉన్న నాలుగు రోజులు ...ఎంత మంచిగా పనిచేశామన్నది లెక్క అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.